Tuesday 19 March 2013

బాల్ పెన్ తో గీచిన రేఖలు శిలాక్షరాలే.



 కళలు ఎన్నో......      కళాకారులు ఎందరెందరో ....            అన్ని కళలలో “ చిత్రకళది”  ప్రత్యేక స్థానం.

 చిత్రకళా జగత్తులోచిత్రకళామతల్లికి  నిరంతర  ఆరాధన  కొనసాగిస్తున్న అజ్ఞాత కళాకారులు ఎందరో , అందులో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన   మల్కారి నాగేంద్రరావు.                                                                తనకెంతో ఇష్టమైన చిత్రకళలో  వైవిధ్యత”  కోసం పరితపించే   చిత్ర కారుడు ఈయన.
 అనంతపురం  జిల్లా  చిత్రకళాకారుడైన (ARTIST)  ఈయన  ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయునిగా,(ART MASTER) పని చేస్తూనే,... బాల్ పెన్నే కుంచెగా  మలచి  ఎన్నో అద్భుత చిత్రాలు వేసి  తన ప్రత్యేకతనుచాటుకున్నారు  మల్కారి నాగేంద్రరావు.


చిత్రకళలో ఎన్నో మాధ్యమాలు(mediums)......OIL PAINTING ,  ENAMIL PAINTING , INK WORK , WATER COLOUR  PAINTING , FABRIC PAINTING , , PENCIL DRAWING  ,SKETCH DRAWING.etc......          
ఈ మాధ్యమాలలో  ఎన్నో  చిత్రాలు  వేసి  నాగేంద్రరావు  తన  ప్రతిభను  చాటుకున్నా..........
చిత్రకళ  కోసం  తపించే కళాకారునిగా ,  వైవిధ్యత కోసం  కుంచెకు  బదులు  కలం  ఉపయోగించి అద్భుత కళాఖండాలను సృష్టించి తన  విశేష  ప్రతిభను చాటుకున్నారు  మల్కారి నాగేంద్రరావు.

ఆధ్యాత్మిక వేత్త, బ్రహ్మశ్రీ కీII శేII మల్కారి నాగోజిరావు  మరియు  సావిత్రిబాయిల  ఐదవ  సంతానంగా 1948 సంII లో అనంతపురంలొ జన్మించారు నాగేంద్ర..   తండ్రి  నాగోజిరావుగారు కుడా చిత్రకారులే .      (1913 సంII నుండి 1968 సంII వరకు అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల్లో డ్రాయింగ్ మాస్టార్ గా పనిచేసారు. )


నాగేంద్ర , తండ్రియొక్క చిత్రకళావారసత్వాన్ని నాగేంద్ర  వృత్తిగా,  ప్రవృత్తిగా మలచుకున్నారు
 ఏడుగురు  అన్నదమ్ములూ ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ రంగాలలో స్థిరపడ్డా , నాగేంద్ర వారసత్వంగా లభించిన  చిత్రకళను  తనదైన  శైలిలో  అభివృద్ధిపరచారు.



ఒక వైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ......మరొకవైపు చిత్రకళలో గురువులైన అల్లబకష్, మరియు తండ్రి  నాగోజిరావుల  శిష్యరికంలో ఎంతో సాధన కొనసాగించి ఎటువంటి చిత్రానైనా అలవోకగా తనదైన శైలిలో సృష్టించే కళాకారుని గా  ఎదిగారు.

1970 సంII లో ప్రభుత్వఉన్నత పాఠశాల నెం:2 లో చిత్రకళోపాధ్యాయులుగా (Drawing Master) ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులలో చిత్రలేఖనం పట్ల అవహాగన కల్గిస్తూ, అభిలాషను పెంపొందిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం లో తనవంతు కర్తవ్యాన్నినిర్వర్తించారు.ఎందరికో అభిమాన గురువయ్యారు.


పాఠశాలలో కేవలం విశ్రాంతి సమయం (LEISURE PERIOD) లోని సమయాన్ని సద్వినియోగపరచుకొనే ప్రయత్నంలో ఆవిర్భవించిందే బాల్ పెన్ చిత్రకళ.
నాగేంద్రరావ్ గారి మాటల్లో .....


ఒకసారి ఏదొ చిత్రాన్ని వేయాలని,...పెన్సిల్ (pencil) అందుబాటులో  లేక  పెన్ (pen) తో వెయాల్సి వచ్చింది. అద్భుతమైన ఫలితం రావడం తో కేవలం బాల్ పెన్ తోనే చిత్రాలు ఎందుకు వేయకూడదు? అని ప్రయత్నించాను. మీరుచుస్తున్న బాల్ పెన్ చిత్రాలు ఆనాటి  ఊహ నుంచి ప్రాణం పోసుకున్న కళారూపాలు.  అప్పటి నుండి ఇప్పటి వరకు బాల్ పెన్ తో దాదాపు 100 కు పైగా ఎన్నో వైవిధ్య చిత్రాలు చిత్రించారు.


      *** ప్రతి సం!! వేసవి లో అనంతపురం పట్టణం లో ప్రభుత్వం వారిచే నిర్వహించబడు
          T.T.C(TEACHERS TECHNICAL  CERTIFICATE OF COURSE) నందు  చిత్రకళ విభాగం
(Drawing Wing)నందు Drawing Instructor గా  దాదాపు 15 సం!! బాధ్యతలను నిర్వర్తించారు.

రాయలసీమ (అనంతపురం, కర్నూల్, చిత్తూరు, కడప) మరియు కర్నాటక , తమిళనాడు ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థినీ విద్యార్థులకు చిత్రకళలో మెళకువలు,  బోధించి ఎందరికో ఆదర్శ గురువయ్యారు.

అనంతపురం పట్టణంలో  సంII 2004  &  సంII 2006 లో  నాగేంద్రరావుచే   ప్రదర్శ్ంచబడిన  ballpen art exhibition లో   ప్రముఖుల  నుండి ప్రశంశలతోపాటు, అన్నిరకాల వర్గాలనుండి మంచి  స్పందన వచ్చింది.
2007 సంII ఉపాధ్యాయునిగా పదవీవిరమణ పొంది  ప్రశాంత జీవితం కొనసాగిస్తూ,
అలసట ఎరుగని యొధునిలా,  దాహం తీరని కళాపిపాసిలా  ఇప్పటికీ  ఆయన  కలం  కొత్త కొత్త చిత్రాలు చిత్రిస్తూ....ఉంది.

బాల్ పెన్ ఆర్ట్ గురించి
సాధారణంగా  చిత్రకళ  లో బాల్ పెన్  ఆర్ట్  ఆనేది   నూతన ప్రత్యేకమయిన కళ.
అభివృద్ధి చెందిన  సాంకేతిక విజ్ఞానానికి  అనుగుణంగా  ప్రాణం పోసుకున్న వినూత్న కళ.
OIL PAINTING,  ENAMIL PAINTING , WATER COLOUR PAINTING ,INK WORK PENCIL DRAWING,....లాంటి ఇతర మాధ్యమాలలో(mediums) పొరపాటు జరిగినా సరిదిద్దుకోవచు గాని ballpen art  లో చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దుకోలేం.

                                  బాల్ పెన్ తో గీచిన రేఖలు శిలాక్షరాలే.

అటువంటి  ballpen art  ని తనదయిన శైలిలో  మరింతగా అభివృద్ధి పరచిన నాగేంద్ర రావు ప్రతిభావిశేషాలు.

  • బాల్ పెన్  చిత్రాలకు   ప్రత్యేకమయిన  పెన్ లు వాడబడలేదు.



  • మార్కెట్ లో మనం సాధారణంగా ఉపయోగించే    రూ. 5/-  “BLACK” బాల్ పెన్ లతో నే అన్ని చిత్రాలు చిత్రించ బడ్డాయి.
  • కేవలం ఒక  మాములు బాల్ పెన్  +  సాధారణ తెల్ల కాగితం   +  తగినంత సమయం  చాలు,
  •  బ్లాక్ అండ్ వైట్ (BLACK & WHITE) ఫోటో లా  అని అబ్బురపరిచే ఒక చక్కని కళాఖండం సృష్టిస్తా అని  ధీమాగా గా చెప్తారు నాగేంద్ర.

  • బాల్ పెన్ చిత్రాలలో ని  BACK GROUND  లో  నలుపు రంగు (డార్క్ ఏరియా) కూడా  కేవలం బాల్ పెన్ తొ చిత్రీకరించడబడింది.

  • చిత్రం లోని ఒక్క BACK GROUND వేయడానికి మాత్రమే వారాల తరబడి సమయం పడుతుంది.

కుంచెకు,కలానికి తేడా వివరిస్తూ...కుంచెలలో  SIZE   బట్టి BACKGROUNDని భర్తీ చేయవచ్చు. కాని......BALLPEN  తో గీతలు సృస్టిస్తూ ....అంచెలు అంచెలుగా వాటి గాఢతను పెంచుతూ చీకటిగా లేదా నలుపు రంగు ప్రదేశాల్ని భర్తీ చేయలి.

                                        ఇందుకు ఎంతో సహనం కావాలి దానితో పాటు నైపుణ్యం అవసరం.

సాధారణ BALLPEN  తో వేసిన  “sketch Art”   ని కళాఖండంగా మలచడానికి ఎంతో ఏకాగ్రత, ఓపిక, మరియు ప్రతిభ అవసరం అవుతాయి.

అందుకే  ఒక్కొక్క చిత్రానికి  రోజులు, వారాలునెలల సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.   

                                                     నాగేంద్ర   గారి  కొన్ని బాల్ పెన్ చిత్రా లలో కొన్ని  ఉపచిత్రాలు (subsidiary figures)ప్రధాన చిత్రం (main figure) లో ఒక భాగంగా కలసిపోయి ఉంటాయిసూక్ష్మంగా పరిశీలిస్తేనే వాటిని గమనించ గలరు.

ఉప చిత్రాలు కూడా ప్రధానచిత్రం లో ఓక భాగంగా కలసిపోయి ఉంటాయి.  (దీనినే illusion art గా వ్యవహరిస్తారు.)  

  • మల్కారి నాగేంద్ర రావు చిత్రకళ ప్రతిభ కు మరో నిదర్శనం  sketches in seconds . కొన్ని నిర్దిష్ట రేఖలతో క్షణాలలో  రేఖా చిత్రాలని సృష్టించగలరు.
  • నాగేంద్ర వేసిన చిత్రాలలో ప్రకృతి అందాలకే కాక , ప్రకృతి స్వరూపమయిన  తెలుగింటి ఆడపడచు కట్టు బొట్టు,  భారతదేశ వివాహ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రాధ్యాన్యత ఎక్కువ


బాల్ పెన్ ఆర్ట్ లోనే కాదు OIL PAINTING  ,   WATER COLOUR PAINTING FABRIC PAINTING  , INK WORK  ,  PENCIL DRAWING  ,  SKETCH DRAWING లలో కూడ నాగేంద్ర రావు కళా ప్రతిభ ను చూడవచ్చు.



































































  









































.                                                               


No comments:

Post a Comment

శ్రీవారి సేవలో శ్రీవారి సేవలో